రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలకు సీఎం కేసీఆరే కారణం – భట్టి విక్రమార్క

Monday, June 7th, 2021, 04:03:26 PM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ తెరాస పాలన విధానం పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి విషయం లో తెరాస ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం లో సంభవిస్తున్న కరోనా వైరస్ మరణాలకు సీఎం కేసీఆరే కారణం అని భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా వైరస్ బాధితులకు ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం అందించాలి అని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అయితే కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చుతామనీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో ప్రకటించారు అని గుర్తు చేశారు. అయితే హామీ ఇచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఇంకా అమలు చేయడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఎన్నికల్లో గెలవడం మరియు నేతలను కొనుగోలు చేయడం పైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ తో ఎంతోమంది చనిపోతున్నా సీఎం కేసీఆర్ కి పట్టడం లేదని విమర్శలు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టులు మరియు తదితరాల పై కోట్ల రూపాయల వెచ్చిచకుండా ప్రజారోగ్యం కి అధిక నిధులను కేటాయించాలి అని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మరి భట్టి చేసిన వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.