భావ‌న రిసెప్ష‌న్‌లో మెగాస్టార్‌?

Tuesday, January 23rd, 2018, 10:33:15 PM IST

అందాల క‌థానాయిక భావ‌న తాను వ‌ల‌చిన సఖుడు.. స్నేహితుడు, క‌న్న‌డ నిర్మాత న‌వీన్‌ని సైలెంటుగా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టిరోజున మ‌ల‌బారు తీరంలోని త్రిస్సూర్‌లోని ఓ ప్ర‌యివేటు క‌ళ్యాణ‌మండ‌పంలో వీరి వివాహం జ‌రిగింది. ఈ వేడుక‌కు కొద్ది మంది బంధుమిత్రులు మాత్ర‌మే ఎటెండ్ అయ్యారు. అదే రోజు సాయంత్రం అంటే నిన్న‌రాత్రి త్రిస్సూర్‌లోనే భారీగా రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ రిసెప్ష‌న్‌కి మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఎటెండ్ అయ్యారు. ఆయ‌న న‌వ‌వ‌ధూవ‌రుల‌కు దీవెన‌లు అందించారు. మ‌మ్ముట్టి స‌హా ప‌లువురు నాయ‌కానాయిక‌లు, భావ‌న స‌న్నిహితులు ఈ వేడుక‌కు ఎటెండ్ అయ్యారు. ఇక వ‌ధూవ‌రుల్ని భావ‌న స్నేహితురాళ్లు ప్ర‌త్యేకంగా డ్యాన్సులు చేస్తూ లోనికి ఆహ్వానించ‌డం హైలైట్ అయ్యింది. ఉత్త‌రాది సాంప్ర‌దాయంలో డ్యాన్సుల తీరుగా భావ‌న‌ను ప్ర‌త్యేకంగా ఇన్వ‌యిట్ చేశారు. అప్పుడు స్నేహితురాళ్ల‌తో క‌లిసి భావ‌న కాలు క‌దిపింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.