ఆ నిర్మాతను పెళ్లి చేసుకుంటున్న భావన ?

Thursday, February 23rd, 2017, 12:05:29 PM IST


లేటెస్ట్ గా ఫిలిం వర్గాల్లో సంచలనం రేపిన భావన కిడ్నప్, లైంగిక వేధింపుల విషయం పై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఓ హీరోపై అనుమానాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె మాజి డ్రైవర్ అతని స్నేహితులు కలిసి భావనను కిడ్నప్ చేసారని వారి వెనక ఈ హీరో హస్తం ఉందని పోలీస్ దర్యాప్తు లో తేలింది. ఇప్పటికే పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే భావన గత కొంత కాలంగా ఓ యువ నిర్మాతతో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి పై రకరకాల వార్తలు వచ్చాయి. ఈ విషయం పై భావన కూడా పెద్దగా స్పందించలేదు. ఇక ఫైనల్ విషయం ఏమిటంటే .. భావనను సదరు నిర్మాత పెళ్లి చేసుకుంటున్నాడట !! ఇప్పటికే ఈ విషయం పై సన్నాహాలు జోరందుకున్నాయని, వచ్చే నెలలో వీరి వివాహం జరగనున్నట్టు తెలిసింది. సో త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన విడుదల చేస్తారట !!