వీడియో : భావ‌న పెళ్లి వేడుక‌లో ప్ర‌ముఖులెవ‌రు?

Wednesday, January 24th, 2018, 12:12:12 PM IST

ఎన్నో ఆక‌శ్మిక ప‌రిణామాలు.. గ‌డిచిన ఏడాదంతా త‌న‌గురించే లోకం కోడై కూసింది. దేశ‌మంతా మాట్లాడుకుంది. అలా జ‌రిగి ఉండాల్సింది కాదు. కానీ జ‌రిగిపోయింది. అయినా విధిని ఎవ‌రూ ఆప‌లేరు క‌దా! జ‌ర‌గాల్సింది జ‌రిగింది. జ‌రిగినా క‌ల‌వ‌ర‌పాటు లేనేలేదు. జ‌రిగిందేదో జ‌రిగింది. ఇక భ‌విష్య‌త్ ఏంటి? జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవ‌డానికి త‌క్ష‌ణం ఏం చేయాలి? ఇలా ఆలోచించింది కుంద‌న‌పు బొమ్మ అందాల క‌థానాయిక‌ భావ‌న‌.

ఏడాది కాలంగా త‌న జీవితాన్ని చుట్టుముట్టిన అనూహ్య క‌ల్లోలానికి ఒక్క‌సారిగా తెర‌దించింది. తెలివైన టైమింగుతో తెలివైన యాక్ట్‌తో త‌న జీవితాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా మ‌లుచుకుని ఎంద‌రో ఆడ‌పిల్ల‌ల‌కు, ఆడ‌ప‌డుచుల‌కు స్ఫూర్తి నింపింది. కిడ్నాప్ ఉదంతం.. క‌ళ్ల ముందే ఉంది.. ఆ త‌ర్వాత త‌న‌పై కీచ‌క‌ప‌ర్వం క‌ళ్ల ముందు మెదులుతూనే ఉంది. అయినా అన్నిటినీ మ‌ర్చిపోయి పెళ్లి కూతురుగా మారింది.. భ‌విష్య‌త్ గురించి క‌ల‌లు కంది. ఆ క‌లల్ని నిజం చేసుకుంది. తాను వ‌ల‌చిన స‌ఖుడు న‌వీన్‌ని పెళ్లాడేసింది. ఈ పెళ్లి వీడియోలేవీ ఇంత‌వ‌ర‌కూ అధికారికంగా లైవ్‌లోకి రాలేదు. ఇవిగో తాజాగా ఆ పెళ్లి వీడియోల్ని నేటి ఏపీ సేక‌రించింది. ఇవిగో భావ‌న వివాహ మ‌హోత్స‌వ వీడియోలు మీకోసం…. ప‌సుపు వ‌ర్ణం ప‌ట్టు చీర‌లో త‌ళ‌త‌ళ‌లాడుతున్న భావ‌న‌.. పెళ్లి కొడుకు న‌వీన్‌తో క‌లిసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. త‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ప‌లువురు సెల‌బ్రిటీలు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. భావ‌న జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లైంది. ఆడంబ‌రంగా.. అట్ట‌హాసంగా ఈ పెళ్లిని జ‌రిపించ‌లేదు. కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో ట్రెడిష‌న‌ల్‌గా జ‌రిపించేశారు. మంగ‌ళ‌వారం ఉద‌య‌మే త్రిస్సూర్‌లోని అమ్మ‌వారి దేవాల‌యంలో వివాహం పూర్త‌యింది. సాయంత్రం అదే త్రిస్సూర్‌లోని లుళు క‌న్వెన్ష‌న్ హాల్‌లో అద్భుతంగా రిసెప్ష‌న్ వేడుక‌గా సాగింది. మెగాస్టార్ మ‌మ్ముట్టి, డ‌బ్బింగ్ ఆర్టిస్టు భాగ్య‌ల‌క్ష్మి, న‌టి న‌వ్యా నాయిర్‌, ర‌మ్య నంబీష‌న్‌, గాయ‌ని స‌యోనారా ఫిలిప్ వంటి ప్ర‌ముఖులు ఈ వివాహ‌వేడుక‌లో పాల్గొన్నారు. న‌వ‌వ‌ధూవ‌రుల్ని ఆశీర్వ‌దించారు.