`పెళ్లి` త‌ర్వాత న‌టించ‌మంటున్నాడు!?

Friday, February 2nd, 2018, 12:20:21 PM IST

పెళ్లి త‌ర్వాత న‌టించొద్ద‌న్నందుకు.. ఈగో స‌మ‌స్య‌ల‌తో భ‌ర్త నుంచి విడిపోయింది అమ‌లాపాల్‌. ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌.విజ‌య్‌ని పెళ్లాడిన ఏడాదిలోగానే ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డి విడిపోయారు. ఆ క్ర‌మంలోనే తాను న‌టించేందుకు అత్త‌మామ‌లు అడ్డు చెప్పార‌ని, భ‌ర్త స‌పోర్టు అంద‌లేద‌ని వాపోయింది. అయితే అదంతా ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఇలాంటి స‌న్నివేశాలు సంఘ‌ట‌న‌లు సినిమా క‌థానాయిక‌ల‌కు ఎదుర‌వుతూనే ఉంటాయి. కొన్నిసార్లు క‌ల‌త‌లు ఇలానే సీరియ‌స్ నిర్ణ‌యాల‌కు దారి చూపిస్తుంటాయి.

ఇటీవ‌లే క‌న్న‌డ నిర్మాత, స్నేహితుడు అయిన న‌వీన్‌ని పెళ్లి చేసుకుంది భావ‌న‌. అయితే త‌ను మాత్రం పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్ ప‌రంగా అంతే బిజీగా ఉంది. ఓవైపు మ‌ల‌యాళం, మ‌రోవైపు క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తూ భావ‌న పూర్తి బిజీగా ఉంది. ఓ మ్యాగ‌జైన్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భావ‌న మాట్లాడుతూ -“పెళ్లి త‌ర్వాత కూడా న‌ట‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాలు చెప్ప‌లేదు మా వారు. అన్ని విధాలా త‌న‌కు స‌హ‌కారం అందిస్తున్నార‌ని, త‌న‌ని బాగా అర్థం చేసుకున్నార‌“ తెలిపింది భావ‌న‌. ప్ర‌తిదీ ఓపెన్‌గా చ‌ర్చించుకుంటాం.విబేధాలు ఉంటే ప‌రిష్క‌రించుకుంటామ‌ని వెల్ల‌డించింది. జ‌న‌వ‌రి 22న త్రిస్సూర్‌లోని ఓ దేవాల‌యంలో ఈ జంట వివాహ‌మైంది. భావ‌న‌ను ఇంత‌కీ వాళ్లాయ‌న ఏమ‌ని పిలుస్తారో తెలుసా? బుజ్జు!!