సమంతతో పవన్ కళ్యాన్ హీరోయిన్…

Saturday, April 14th, 2018, 11:55:34 AM IST

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి మెప్పించిన అందాల హీరోయిన్ భూమిక‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి కాస్త దూర‌మైన భూమిక ఈ మ‌ధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా తెర‌కెక్కిన‌ ఎంసీఏ చిత్రంలో వ‌దిన పాత్ర‌లో న‌టించి అల‌రించింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత‌- ఆది పినిశెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న యూట‌ర్న్ చిత్రంలో న‌టిస్తుంది. రీసెంట్‌గా టీంతో క‌లిసిన భూమిక వారంద‌రితో క‌లిసి ఫోటో దిగింది. ఈ ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అయింది. యూ ట‌ర్న్ మూవీ క‌న్న‌డ‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన యూ టర్న్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. క‌న్న‌డలో డైరెక్ష‌న్ చేసిన ప‌వ‌న్ కుమార్ తెలుగు మూవీని కూడా తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్న ఈ మూవీలో భూమిక దెయ్యంలా క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. భూత్ బంగ్లాలో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. జర్నలిస్ట్ పాత్రలో సమంత నటిస్తుండగా .. పోలీస్ ఆఫీసర్ పాత్రను ఆది పినిశెట్టి చేస్తున్నాడు

  •  
  •  
  •  
  •  

Comments