బిగ్ బ్రేకింగ్: వైసీపీలోకి భూమా ఎంట్రీకీ లైన్ క్లియర్.. షాక్‌లో టీడీపీ..!

Thursday, June 13th, 2019, 09:37:12 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే జగన్ తన కేబినెట్‌ను కూడా ప్రకటించి వారితో కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. అంతేకాదు తాజాగా నిన్న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలతో కూడా ప్రమాణస్వీకారాం చేయించాడు.

అయితే 2014 ఎన్నికలలో ఓటమి పాలైనా వైసీపీ ఈ సారి మాత్రం భారీ మెజారిటీనీ గెలుచుకుంది. అయితే 2014లో వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అయితే అందులో భూమా అఖిల ప్రియ కూడా ఒకరు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన ఈమెకు టీడీపీలో మంత్రి పదవి కూడా లభించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికలలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ తరపున పోటీ చేయించి గెలిపించుకున్నారు. అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో మాత్రం వీరిద్దరు ఓడిపోవడం, ఇక టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా కనపడకపోవడం చూసి మళ్ళీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైంది. అంతేకాదు దీనికోసం తెర వెనుక మంతనాలు కూడా సాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే వీరి కుటుంబంతో ఎప్పటి నుంచో సాన్నిహిత్యంగా ఉన్న వైఎస్ విజయమ్మ ద్వారా వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భూమా ఆలోచిస్తున్నరట. అయితే తాను టీడీపీలో ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్ప్పుడు కానీ జగన్ పై ఎలాంటి ఆరోపనలు చేయలేదని ఆయన అంటే నాకు ఎప్పుడు అభిమానమే అంటూ భూమా మాట్లాడుతుంది. అయితే ఇవన్ని చూస్తుంటే త్వరలో మళ్ళీ భూమా కుటుంబం వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని దానికి జగన్ కూడా కాస్త సానుకూలంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.