మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్న భూమా అఖిలప్రియా – జగన్ ఏమంటారో మరి…?

Wednesday, June 12th, 2019, 01:20:23 AM IST

గతంలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆ తరువాత టీడీపీ చేరి మంత్రి అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో గెలిపించుకున్నారు. అయితే ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో అఖిల ప్రియా తో పాటే తన సోదరుడు కూడా ఓటమి పాలయ్యారు. కాగా ఈ ఓటమితో నిరాశకి గురయిన అఖిల ప్రియా మళ్ళీ వైసీపీ లోకి వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుందని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ కోనసాగుతోంది. ఇందుకోసం సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను సంప్రదించేందుకు అఖిలప్రియ ప్రయత్నాలు కూడా చేశారని సమాచారం.

కాగా వీరిరువురి కుటుంబంలో బంధుత్వం ఉండటం వలన వారి బంధువులతో సంప్రదింపులు జరిపారని అఖిల తరపు కార్యకర్తలు చెబుతున్నారు… కాగా గతంలోనే మోసం చేసిన భూమా ఫ్యామిలీని జగన్ మళ్లీ కలుపుకుంటారా లేదా అనేది తెలియాలి. అసలు ఇందుకు విజయమ్మ అఖిలప్రియకు సహకరిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కాగా అఖిల ప్రియా మళ్ళీ వైసీపీ లోకి వస్తున్నారా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.