భూమన అలక.. జగన్ పట్టించుకుంటారా !

Saturday, June 8th, 2019, 12:16:38 AM IST

ఇన్నాళ్లు వైకాపాలో కీలకంగా, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. పార్టీతో ఆయన సాన్నిహిత్యం చూసిన వారంతా జగన్ అధికారంలోకి వస్తే భూమనకు మంచి ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అలా లేవు. తిరుపతి నుండి మంత్రి పదవి రేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా లాంటి వాళ్లు కూడా పోటీలో ఉండటంతో భూమనకు అవకాశాలు టక్కువగా ఉన్నాయి.

ఈ విషయం భూమనకు కూడా అర్థమై తన అలకను బహిరంగంగా బయటపెట్టారు. నియోజకవర్గా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అంటే తాను రాజకీయాల్లో ఉండేది ఈ టర్మ్ మాత్రమేనని, కనుక తనకే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానానికి హింట్ ఇచ్చారు. మరి భూమన అలకను జగన్ గమనించి రాజకీయాల నుండి రిటైర్ అయ్యే లోపు మంత్రి అవ్వాలనే ఆయన ఆశ నెరవేరేలా నిర్ణయం మార్చుకుంటారో లేదో చూడాలి.