ప్రభాస్ తో చేతులు కలిపినా బాలీవుడ్ నిర్మాత

Tuesday, April 17th, 2018, 04:20:06 PM IST

బాహుబ‌లి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం సంపాదించిన హీరో ప్ర‌భాస్‌. ఇప్పుడు ఈ హీరో సినిమాల‌పై తెలుగులోనే కాదు హిందీలోను భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ర‌న్ రాజా ఫేం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ బేనర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. అయితే బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మ‌రియు టి సిరీస్ చైర్మ‌న్ భూష‌న్ కుమార్ .. ప్ర‌భాస్ మ‌రియు యూవీ క్రియేష‌న్స్‌తో చేతులు క‌లిపాడు. ఈ విష‌యాన్ని త‌రణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్ ద్వారా తెలిపాడు. హిందీ థియేట్రిక‌ల్ రైట్స్‌ని భూష‌న్ 120 కోట్ల‌కి ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తుంది. రిలీజ్‌కి ముందే భారీ బిజినెస్ జ‌రుపుకుంటున్న సాహో చిత్రం ఇటీవ‌ల శాటిలైట్ రైట్స్‌కి గాను 150 కోట్లు ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ చిత్రం దుబాయ్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని రిస్కీ స్టంట్స్ ఉంటాయని తెలుస్తుండగా, హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో యాక్ష‌న్ సీక్వెన్స్ రూపొందించ‌నున్నార‌ని స‌మాచారం. బుర్జ్ క‌ల్ఫియా, రాస్ అల్ కైమా, వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ ప్రాంతాల‌లో ప్ర‌భాస్‌పై చేజింగ్ సీన్స్ తీయ‌నున్నార‌ట‌. అబుదాబిలోని ఎతిహాడ్ ట‌వ‌ర్ ద‌గ్గ‌ర కూడా ప‌లు స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. సాహో ఒక నవల తరహాలో కొనసాగే యాక్షన్ డ్రామా కాగా ఈ సినిమాలో, నీల్ నితిన్ ముఖేష్ .. జాక్ ష్రాఫ్ .. చుంకీ పాండే .. అరుణ్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments