షాక్ .. బిచ్చగాడి దెబ్బకు .. బాహుబలి రికార్డులు విలవిల

Friday, November 25th, 2016, 12:41:33 PM IST

BICHAGADU
ఇండియా సినిమా చరిత్రలో ”బాహుబలి” ఓ సంచలన సినిమా. దాదాపు 600 కోట్ల వసూళ్లు సాధించి .. ప్రతి విషయంలో దుమ్ము రేపిన సినిమా, అల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాను తలదన్నే సినిమా వస్తుందా అని అనుకున్న వారికి షాక్ ఇచ్చేలా చేసాడు ”బిచ్చగాడు”. ”బాహుబలి” సినిమా టీవీల్లో ప్రసారం అయి .. అక్కడ దుమ్ము రేపింది. టాప్ రేటింగ్ తో ఎవరు చేరుకోని అంచనాలకు వెళ్ళింది .. అలాంటి టివి రెంటింగ్ రికార్డు విషయంలో ‘బిచ్చగాడి’ దెబ్బకు ‘బాహుబలి’ రెండో స్థానానికి పడిపోయింది !! ‘బిచ్చగాడు’ సినిమా తమిళంలో ‘పిచ్చాయికరన్’ గా విడుదలైన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమా ఘాన విజయాన్ని అందుకుంది, ఇక లేటెస్ట్ గా టీవీల్లో ఈ సినిమా ప్రసారం అయింది, టీవీల్లో ప్రసారం అయిన ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తలదన్నేలా దూసుకుపోయింది, బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అందించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ‘బాహుబలి’ పేరిట టాప్ లో ఉన్న ఈ రికార్డును బిచ్చగాడు(పిచ్చాయికరన్ ) అధిగమించాడు, దాంతో ‘బాహుబలి’ రెండో ప్లేస్ కు వెళ్ళింది అని రిపోర్ట్ ఇచ్చారు. వెండితెర పై బాహుబలి సృష్టించిన సంచలనం ..బుల్లితెరపై బిచ్చగాడు క్రియేట్ చేసి సంచలనం రేపాడు !!