బిగ్ బ్రేకింగ్ : కాకినాడలో జనసేన,టీడీపీలకు భారీ షాక్.!

Monday, February 17th, 2020, 01:19:25 PM IST

ఈసారి ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన రెండు పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయాయి.దీనితో ఈ రెండు పార్టీల నుంచి పలువురు నేతలు మెల్లగా జారుకోడం మొదలు పెట్టారు.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే చాలా మందే ఇతర పార్టీలలోకి జంప్ అయ్యిపోయారు.కానీ ఈ పార్టీతో పోలిస్తే జనసేన నుంచి బయటకెళ్లిన వలసలు తక్కువ.

అయితే మాములుగా పార్టీకు చెందిన కీలక నేతలు పార్టీలు మారడం ఏమో కానీ కాకినాడలో మాత్రం ఒకేసారి జనసేన మరియు టీడీపీకు చెందిన స్థానిక నేతలతో పాటుగా దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు వైసీపీ తీర్ధం పుచ్చుకొని జనసేన మరియు టీడీపీ పార్టీలకు ఒకేసారి భారీ షాకిచ్చారు.జనసేన పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, సురవరపు సురేష్‌, టీడీపీ మహిళా నాయకురాలు వర్ధినీడి సుజాత, నాయకులు సింగంపల్లి బాబురావు, తడాల సత్యనారాయణతో పాటు 500 మంది వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని తెలుస్తుంది.