బిగ్ బ్రేకింగ్ : కెసిఆర్ కు ఊహించని షాక్..పార్టీ వీడనున్న కీలక నేతలు!

Tuesday, September 10th, 2019, 05:00:45 PM IST

ఒక పక్క ఏపీ రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతుంటే మరో పక్క ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.నిజానికి అక్కడ పాగా వేసేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుండగా అందుకు అక్కడ ప్రభుత్వం అయినటువంటి తెరాస కూడా లైన్ బాగానే క్లియర్ చేస్తుందని చెప్పాలి.ఎందుకంటే తాజాగా కెసిఆర్ తన పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ప్రకటించేసారు.ఈ జాబితాలో కెసిఆర్ నుంచి మాట తీసుకున్న వారు అలాగే ఎప్పటి నుంచో మంత్రి స్థానాన్ని ఆశిస్తున్న వారికి చేదు అనుభవమే మిగిలింది.

దీనితో ఆ అసమ్మతి నేతలు అంతా ఇప్పుడు తెరాస పార్టీను వీడే ఆలోచనలో ఉన్నారని వార్తలు ఊపందుకున్నాయి.నాయని నరసింహ రెడ్డి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి నిజామాబాద్ రురల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సహా మరికొంత మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.వీరిలో చాలా మంది ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని ఈ నెల 17,18 లోపు అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో వీరంతా చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి.మరి వీరిని కెసిఆర్ ఆపుతారో లేదో చూడాలి.