చరణ్ సినిమాలో ఛాన్స్ పై కౌశల్ ఏమన్నాడు ?

Friday, October 5th, 2018, 12:11:28 AM IST


బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా సంచలనం క్రియేట్ చేసిన కౌశల్ కు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. దాదాపు అత్యధిక ఓట్లతో సంచలనం రేపాడు. ఈ క్రేజ్ తో ఆయనకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కౌశల్ ఫాన్స్ .. అందరు కలిసి కౌశల్ ఆర్మీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే .. ఈ ఆర్మీ అంతా కలిసి క్రౌడ్ ఫండింగ్ ద్వారా హీరోగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా కౌశల్ కూడా రామ్ చరణ్ – బోయపాటి సినిమాలో ఛాన్స్ వచ్చిందని, అయన విలన్ గా కనిపిస్తాడంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై కౌశల్ స్పందించాడు. బోయపాటి శీను, చరణ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ అది ఇంకా ఖరారు కాలేదని చెప్పాడు. ఒక సింగిల్ కంటెస్టెంట్ కి ఇన్ని ఓట్లు రావడం అన్నది చరిత్రలో లేదట .. గిన్నిస్ బుక్ వెళ్లనుంది ఫోన్ కూడా వచ్చిందని చెప్పాడు. మొత్తానికి కౌశల్ కు బోయపాటి శీను సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ .. ఫైనల్ కాలేదన్నమాట.