బిగ్ బాస్ 2 : మసాలా డోస్ పెంచుతారా?

Saturday, May 19th, 2018, 01:03:08 PM IST

బాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షో మంచి హిట్ అయ్యేలా చేశాడు. అయితే ఈ సారి దాన్ని అదే రేంజ్ లో కంటిన్యూ చేయడానికి నాని సిద్దమయ్యాడు. సెకండ్ సీజన్ కి నాని గుర్తింపు తెస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమో కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ మొదటి షో లాగా కాకుండా నాని ‘బాబాయ్ ఈ సారి ఇంకొంచెం మసాలా’ అని అంటున్నాడు.

దీంతో షోలో ఈ సారి గ్లామర్ టచ్ ఎక్కువగా ఇస్తారా లేక కాంట్రవర్షియల్ ని క్రియేట్ చేస్తారా అనే కామెంట్స్ వస్తున్నాయి. అలా జరిగితే మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ ఎవరైనా ఆరోపణలు చేస్తే షోకి ఓ విధంగా ఫ్రీ పబ్లిసిటి వచ్చినట్టే. బాలీవుడ్ – కోలీవుడ్ లో చాలా వరకు బిగ్ బాస్ ఆ విధంగానే ఎక్కువ క్రేజ్ అందుకుంటోంది. మరి ఈ సారి నాని నేతృత్వంలో తెలుగు షో రేటింగ్ ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments