సామ్రాట్ కు పచ్చబొట్టు పొడిపించుకునే రేంజ్ ఫాన్స్ కూడా ఉన్నారా..?

Saturday, October 6th, 2018, 04:33:28 PM IST

బిగ్ బాస్ తెలుగు రెండో సీసన్ బుల్లి తెరపై ఎంత సంచలనాన్ని సృష్టించిందో అందరకి తెలుసు.ఇప్పుడెలాగో కౌశల్ భారీ గెలుపుతో ముగిసిపోయింది.ఇక అందరు ఆటగాళ్లు బయటకి వచ్చేసారు.కౌశల్ కూడా పలు ఇంటర్వ్యూల్లో బిగ్ బాస్ లో తన అనుభవాలను తన అభిమానులకు తెలియజేసుకున్నాడు.బిగ్ బాస్ ఫైనలిస్ట్ లలో ఒకరైన సామ్రాట్ కూడా ఇప్పుడు తన అనుభవాలను మీడియా ముఖంగా వ్యక్త పరిచారు.తాను బయటకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా తన అభిమానులు అమితమైన ప్రేమను కనబరిచేవారని,మరికొంత మంది అభిమానులు అయితే తన మీద ఉన్న అభిమానాన్ని పచ్చ బొట్లుగా కూడా పొడిపించుకున్నారని,వారు అందరు తనని ఎంత గానో అభిమానించారు అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.