బిగ్ బాస్ 2 కి మీరూ వెళ్తారా..? అయిరే దీక్షా పాఠాలు చూసేయండి

Friday, May 4th, 2018, 04:11:53 PM IST

ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేసిన తెలుగు రియాలిటి షో బిగ్ బాస్‌. ఈ కార్య‌క్ర‌మంతోనే ఎన్టీఆర్ బుల్లితెర‌కి డెబ్యూ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజ‌న్ 1లో జూనియ‌ర్ త‌న‌దైన సంబాష‌ణ‌ల‌తో పాటు కంటెస్టెంట్‌ల‌ని డీల్ చేసిన విధానం బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చేసింది. బిగ్ బాస్ 2 సీజ‌న్ ఎప్పుడు మొద‌లు అవుతుందో అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే సీజ‌న్‌2 మొద‌లు కానుండ‌గా, దీనికి నానిని హోస్ట్‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నారు. సెకండ్ సీజ‌న్ కోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్ వేసి షూటింగ్ జ‌ర‌ప‌నున్నార‌ని టాక్‌. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 2కి సంబంధించి స్మాల్ ప్రోమో విడుద‌ల చేశారు నిర్వాహ‌కులు. ఇందులో సీజ‌న్ 1 కంటెస్ట్ అయిన దీక్షా పంథ్ సామాన్యుల‌కి పాఠాలు చెబుతున్న‌ట్టుగా ఉంది. సామాన్యులు కూడా సీజ‌న్ 2లో పార్టిసిపేట్ చేయోచ్చంటూ వీడియో ద్వారా తెలిపారు. మ‌రి దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments