బిగ్ బాస్ కోసం ఆడిషన్స్ మొదలయ్యాయా ?

Friday, May 4th, 2018, 11:00:23 PM IST


బిగ్ బాస్ ఇప్పటికే బాలీవుడ్ లో సంచలనం రేపిన షో .. తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన మొదటి భాగం సంచలన విజయం అందుకుంది. మొదటి సీజన్ సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కోసం సన్నాహాల్లో జోరు పెంచారు నిర్వాహకులు. ఈ రెండో సీజన్ లో ఎవరు పాల్గొంటారా అన్న విషయంతో పాటు హోస్ట్ గా ఈ సారి ఎన్టీఆర్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఎవరు హోస్ట్ గా చేస్తారన్న విషయం ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ ప్లేస్ లో హీరో నాని ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే నానితో చర్చలు జరిపారని .. ఈ సెకండ్ సీజన్ కోసం నానికిమూడున్నర కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇక ఈ షో లో పాల్గొనే వాళ్ళ విషయంలో క్లారిటీ రాలేదు .. అయితే మొదటి భాగంలో పాల్గొన్న హీరోయిన్ దీక్షా పంత్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ రెండో సీజన్ లో సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలకు సైతం అవకాశం ఇవ్వనున్నారట. ఇద్దరు లేదా ముగ్గురికి ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ సారి 100 రోజుల పాటు ఈ షో జరగనుంది.

  •  
  •  
  •  
  •  

Comments