16 మందితో బిగ్ బాస్ రెండో జాతర రెడీ ?

Thursday, May 31st, 2018, 10:16:09 AM IST

తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే. దాంతో ఈ షో కు రెండో సీజన్ కు రంగం సిద్ధం అయింది. అయితే ఈ సారి వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో నాచురల్ స్టార్ నాని ని హోస్ట్ గా నియమించింది బిగ్ బాస్ టీమ్. నాని హోస్ట్ గా చేస్తున్న ఈ రెండో సీజన్ త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ సారి 100 రోజులపాటు 16 మంది సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో గడపాలట. నిజానికి మొదటి సీజన్ 70 రోజులే ఉండేది. ఇక జూన్ 10 నుండి స్టార్ మా టివిలో శనివారం, ఆదివారం రోజుల్లో 9. 30 గంటలకు ప్రసారం అయ్యే ఈ షో లో ఎవరెవరు పాల్గొంటారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే ఈ షో లో పాల్గొనే వాళ్ళ పేర్లు బయటికి లీక్ అయ్యాయి. అందులో సెలెబ్రిటీస్ తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా పాల్గొంటారని టాక్. ఇక సెలెబ్రిటీ లిస్ట్ లో యాంకర్స్ .. శ్యామల, లాస్య, సింగర్ గీతా మాధురి, హీరోలు .. ఆర్యన్ రాజేష్, వరుణ్ సందేశ్, హీరోయిన్స్ మాధవి లతా, గజాల, ధన్య బాలకృష్ణ, కమెడియన్ నల్ల వేణు, మాజీ హీరోయిన్ రాశి తదితరులు పాల్గొంటారని టాక్. మరి ఈ సెకండ్ సీజన్ లో కాస్త మసాలా ఎక్కువగా ఉంటుందని నాని మాట ఇచ్చేసాడు కాబట్టి .. ఇంకెవరైనా హాట్ భామలు కూడా ఉండే అవకాశం ఉంది .. సో ఏది ఏమైనా ఈ షో లో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే ఈనెల 10 దాకా ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments