సైరా కోసం భారీ క్లైమాక్స్ మొదలు పెట్టారు ?

Tuesday, October 9th, 2018, 10:06:12 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం సైరా . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియా లో మొదలైంది. అక్కడ భారీ క్లైమాక్స్ ప్లాన్ చేసి నిన్ననే షూటింగ్ మొదలు పెట్టారు. తాజాగా ఈ లొకేషన్ లోని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. జార్జియా లో జరిగే భారీ షెడ్యూల్ కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ పెట్టారట. ఈ షెడ్యూల్ లో తమిళ హీరో విజయ్ సేతుపతి జాయిన్ అయ్యాడు. భారీ ఎత్తున షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. బ్రిటిష్ సైన్యానికి, సైరా నరసింహ రెడ్డి అనుచరుల తో పాటు పలువురు దేశభక్తులు ఈ యుద్ధంలో పాల్గొననున్నారు. నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, జగపతి బాబు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తున్నారు.