చరణ్ సినిమాకు బిగ్ డీల్ కుదిరిందా ?

Sunday, May 13th, 2018, 04:27:06 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్యాంకాక్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తారట. ఈ సినిమా హక్కుల విషయంలో భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఇప్పటికే హిందీ డబ్బింగ్ హక్కుల కోసం ఏకంగా 21 కోట్ల భారీ అఫర్ వచ్చిందట. హిందీలో రామ్ చరణ్, అటు హీరోయిన్ ఖైరా అద్వానీ పరిచయమే కాబట్టి ఈ రేంజ్ రేటు పలికిందని టాక్. భారీ కాంపిటీషన్ మధ్య 21 కోట్లకు ఆ డీల్ సెట్ చేశారట. ఇక తెలుగు సాటిలైట్ విషయంలో కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని టాక్. మరి ఇంకా టైటిల్ పెట్టకముందే చరణ్ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిందంటే ఇక టైటిల్ పెడితే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి.

Comments