స‌వ్య‌సాచికి ఏపీలో డిమాండ్‌

Sunday, July 29th, 2018, 01:03:49 PM IST

అక్కినేని నాగ‌చైత‌న్య మార్కెట్ రేంజ్ డ‌బుల్ అవుతోందా? అంటే అవుననే తాజా స‌న్నివేశం చెబుతోంది. గ‌త కొంత కాలంగా చైతూ స‌క్సెస్ రేటు బావుండ‌డం అత‌డి తాజా చిత్రాల‌కు క‌లిసొస్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ప్ర‌స్తుతం చైత‌న్య న‌టించిన స‌వ్య‌సాచి బిజినెస్ వ‌ర్గాల్లో వేడి పెంచుతోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఆంధ్రా ఏరియా థియేట్రిక‌ల్ హ‌క్కుల్ని దాదాపు 9.5కోట్ల‌కు ఓ ప్ర‌ముఖ పంపిణీదారుడు చేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. చైతూ మార్కెట్‌కి ఇది రెట్టింపు విలువ అని చెబుతున్నారు.

అలానే సీడెడ్ ఏరియాకు 3కోట్ల వ‌ర‌కూ బిజినెస్ పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. క‌ర్నాట‌క‌లోనూ భారీ మొత్తాన్నే ఆఫ‌ర్ చేస్తున్నార‌ని, ఓవ‌ర్సీస్ స‌హా అన్ని ఏరియాల బిజినెస్ 30 కోట్ల వ‌ర‌కూ తేలే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. శాటిలైట్‌, ఆడియో, డిజిట‌ల్ రైట్స్ రూపంలో అద‌న‌పు మొత్తాల్ని అందుకునే ఛాన్సుంది. `స‌వ్య‌సాచి` బిజినెస్‌కి మాధ‌వ‌న్‌, భూమిక వంటి స్టార్లు అద‌న‌పు బ‌లంగా మారారుట‌. మొత్తానికి అక్కినేని బుల్లోడు రెయిజింగ్‌లోనే ఉన్నాడ‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక మ‌రో సినిమా `శైల‌జారెడ్డి అల్లుడు`కి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు కాబ‌ట్టి, ఆ సినిమాకి ట్రేడ్‌లో మాంచి డిమాండే ఉందిట‌.

  •  
  •  
  •  
  •  

Comments