మాజీ మంత్రి నారాయణకు ఘోర అవమానం.. కాలర్ పట్టుకున్నారుగా..!

Wednesday, December 4th, 2019, 02:04:30 AM IST

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఘోర అవమానం జరిగింది. నేడు అనంతపురం జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి నారాయణను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అయితే ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

అయితే ఫీజుల పేరుతో నారాయణ విద్యా సంస్థలలో విద్యార్థులను వేధిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. అయితే ఇదే క్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేత ఆవుల రాఘవేంద్ర నారాయణ షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీశారు. అంతేకాదు నారాయణ కారుకు అడ్డుపడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థలను మూసివేయాలని వారంతా డిమాండ్ చేశారు.