దిశ కేసులో మరో కీలక మలుపు.. పోలీసులు బుక్కైనట్టే..!

Saturday, December 14th, 2019, 08:36:05 PM IST

దిశ హత్య కేసుకు సంబంధించి నలుగురు నింధితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపిన సంగతి తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను దిశను చంపిన సంఘటన స్థలం చటాన్‌పల్లి వద్దకు తీసుకుని వెళ్ళగా వారు పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై దేశమంతా హర్షం వ్యక్తం చేసినా, కొందరు మాత్రం పోలీసుల తీరును తప్పుపట్టారు. నిందితులకు న్యాయస్థానం ద్వారా శిక్ష పడాలి కానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎన్‌కౌంటర్ పేరుతో చంపడం తప్పేనని అంటున్నారు.

అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమీషన్ ఏడుగురు సభ్యుల బృందంతో పర్యటించి ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించి పోలీసులపై హైకోర్ట్‌లో పిటీషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ ఎన్‌కౌంటర్ కావాలనే చేశారని జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆరోపిస్తున్న సమయంలో తెరపైకి మరో కొత్త విషయం భయటకొచ్చింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కొందరు మానవ హక్కుల కార్యకర్తలతో పోలీసులు ఫోన్‌లో మాట్లాడారని, పోలీసు శాఖలోని కొందరు సీనియర్ అధికారులు ఏకంగా మానవహక్కు కార్యకర్తలను కలిసినట్టు ఓ ప్రముఖ పత్రిక సంచలన నిజాన్ని భటపెట్టింది. అంతేకాదు ప్రజలు కోరుకున్న ఎన్‌కౌంటర్ అని దానికి మానవ హక్కుల కార్యకర్తలు కూడా తమకు మద్ధతు తెలపాలని పోలీసులు కోరినట్టు వెల్లడించింది.