ఏపీ సీఎంఓలో కీలక మార్పులు చేసిన జగన్.. ఆ ముగ్గురికి షాక్..!

Thursday, July 9th, 2020, 11:30:01 AM IST

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు సీఎంఓలో చక్రం తిప్పిన ప్రధాన సలహాదారు అజయ్ కల్లంను మరియు పీవీ రమేష్, జే. మురళీలను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు సాధారణ పరిపాలన శాఖ, సీఎం డ్యాష్ బోర్డ్, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయ శాఖ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను అప్పగించగా ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్‌కు విద్యా, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ, గనులు, ఆర్టీసీ, గృహ నిర్మాణం, రవాణా, ఆర్ అండ్ బీ, పౌర సరఫరాలు, పీఆర్, సంక్షేమం,
కార్మిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి పరిధిలో వ్యవసాయం, వైద్యారోగ్యం, ఇంధనం, టూరిజం, మార్కెటింగ్, ఆర్ధిక శాఖ (ఖర్చులు), జలవనరులు, అటవీ, మున్సిపల్ శాకలు ఉంటాయి. ఇక మొన్నటి వరకు రెవెన్యూ, GAD, ఫైనాన్స్, శాంతి భద్రతల బాధ్యతల నుంచి అజయ్ కల్లంను తొలగించడంతో ఇక నుంచి ఆయన కేవలం సలహాదారుగానే కొనసాగనున్నారు.