బిగ్ మిరాకిల్: రిక్షాతో మూడేళ్ళ చిన్నారిని కాపాడిన రిక్షావాలా..!

Monday, October 21st, 2019, 10:34:36 PM IST

ఆ పిల్లాడి అదృష్టమో, లేక ఒక మిరాకిల్ జరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. ఏదైతేనేమి మొత్తానికి మృత్యువును జయించాడు ఆ పసివాడు. మధ్యప్రదేశ్లోని టీకమ్గఢ్ పట్టణం టగన్ వీధిలో ఓ మూడేళ్ళ చిన్నారుడు పర్వా జైన్ ఇంట్లో ఆడుకుంటూ రెండవ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి పడ్డా కూడా ఆ పిల్లాడు బ్రతికి భయ్టపడ్డాడు. అదెలా అని ఆశ్చర్యంగా ఉంది కదూ.

అయితే ఆ పిల్లాడు బిల్డింగ్ మీద నుంచి కింద పడ్డ సమయంలో ఆ వీధులలోకి వచ్చింది ఒక రిక్షా. అయితే ఆ రిక్షా వెలుతున్న సమయంలోనే బాలుడు కింద పడడంతో సరాసరి రిక్షా సీటు పైనే పడ్డాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే కొద్ది క్షణాలు ఆ రిక్షా రావడం లేట్ అయినా, రిక్షా ముందుకు వెళ్ళాక ఆ పసివాడు కిందపడినా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకునేవి. అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా తమ బాలుడి కోసం దేవుడే ఆ రిక్షాను పంపాడని ఆ పసివాడి తల్లిదండ్రులు రిక్షావాలాకు రుణపడి ఉంటామని తెలుపుకుంటూ అతడికి కొత్తబట్టలు, ఆయన పిల్లలకు స్వీట్లు కొని ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఒక మిరాకిల్‌గా నిలిచిన ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.