ట్రెండీ టాక్‌ : ఛార్మికి అలా పంచ్ ప‌డింది!

Thursday, May 17th, 2018, 12:00:27 PM IST

సినీప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. ఇక్క‌డ ఓవ‌ర్‌నైట్ కింగ్ అయిపోవ‌చ్చు. అదే ఓవ‌ర్‌నైట్‌లో ఉన్న‌దంతా ఊస్టింగూ అవ్వొచ్చు. అలాంటి స‌న్నివేశం ఎదుర్కొని ఎంద‌రో క‌నుమ‌రుగైన సంద‌ర్భాలున్నాయి. అదంతా అటుంచితే.. గ‌త కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అందాల ఛార్మి ఈ రంగంలో రూటు మార్చి నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును పెట్టుబ‌డిగా పెట్టి సినిమాలు తీసేందుకు ముందుకొచ్చింది. ఆ క్ర‌మంలోనే పూరి జ‌గ‌న్నాథ్ తో క‌లిసి పూరి క‌నెక్ట్స్ ద్వారా కీల‌క బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు ఛార్మి.

మొన్న‌టికి మొన్న ఆకాశ్ పూరీని హీరోగా రీలాంచ్ చేస్తూ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `మెహ‌బూబా`లో ఛార్మిదే క‌ష్టం అంతా. కొండ కోన‌ల్లో, మంచులో ఎన్నో క‌ష్టాలు భ‌రించింది ఛార్మి. ఆన్ లొకేష‌న్ యూనిట్‌తో క‌లిసి ఎంత‌గానో శ్ర‌మించింద‌న్న టాక్ న‌డిచింది. మెహ‌బూబాతో హిట్ కొట్టి ఆకాశ్‌ని సొంత హీరోగా ఎలివేట్ చేయాల‌ని ప్లాన్ చేశారు ఈ బృందం. అంతేకాదు ఆకాశ్‌ని హీరోని చేసేందుకు పూరి ఏకంగా ఇల్లు అమ్మితే, అత‌డి స్నేహితురాలిగా ఛార్మి సైతం పెద్ద మొత్తాన్నే రిస్క్ చేసింద‌ని తెలుస్తోంది. పూరి టూరింగ్ టాకీస్ నిర్మించిన ఈ సినిమాకి స‌హ‌నిర్మాత‌గా ఛార్మి ఏకంగా 6కోట్లు పెట్టుబ‌డి స‌మకూర్చిందిట‌. త‌న‌కి ఉన్న‌దంతా ఈ సినిమాపై హోప్స్‌తో పెట్టుబ‌డిగా వెద‌జ‌ల్లింద‌ని చెబుతున్నారు. అయితే మెహ‌బూబా ఫ‌లితం మాత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. సినిమా యావ‌రేజ్ అయినా, అదో ఫ్లాప్ అన్న టాక్‌ని ముందే సమీక్ష‌కులు స‌మీక్ష‌ల్లో స్ప్రెడ్ చేయ‌డం పెద్ద దెబ్బే కొట్టింద‌న్న మాటా వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు నైజాం హ‌క్కుల‌ను 9 కోట్ల‌కు కొనుక్కున్న దిల్‌రాజుకు మాత్రం ఏ న‌ష్టం లేదుట‌. ఇది కేవ‌లం దిల్‌రాజా ఛ‌రిష్మాని ఉప‌యోగించుకునేందుకు పూరి & టీమ్ వేసిన ఎత్తుగ‌డ‌. పైగా దిల్‌రాజు తెలివిగా అడ్వాన్స్ బేసిస్‌లో ఈ సినిమా హ‌క్కులు కొనుక్కున్నారు. దీన‌ర్థం న‌ష్టాలొస్తే నిర్మాతలే భ‌రించాలి. లాభాలొస్తే వాటాలు అందుతాయ‌ని. అంటే ఇప్పుడు న‌ష్టం మొత్తం పూరి& ఛార్మికే చెందుతుంది. దిల్‌రాజు ప్ర‌చారార్భాటం సాయం వ‌ర‌కేన‌ని తేలిపోయింది. మొత్తానికి సినిమా అనే క్రీడ‌లో ఛార్మి ఇప్ప‌టికి వెన‌కంజ వేసింది. చూద్దాం.. ఈ పాము-నిచ్చెన ఆట‌లో ఎంత‌వ‌ర‌కూ ఈద‌గ‌ల‌దో?

Comments