మెగాస్టార్ కోసం అమెరికాలో భారీ ర్యాలీ ?

Tuesday, April 24th, 2018, 02:06:55 AM IST

మెగాస్టార్ స్టామినా ఏమిటో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోగా మెగాస్టార్ కు ఓ రేంజ్ క్రేజ్ ఉంది. తాజగా ఆయనకోసం అమెరికాలో ఏకంగా 200 కార్ల తో భారీ ర్యాలీ ప్లాన్ చేసారు. మెగాస్టార్ కోసం అదికూడా అమెరికాలో భారీ ర్యాలా అని షాక్ అవుతున్నారా .. నిజం .. ఆ వివరాల్లోకి వెళితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ను ప్రారంభించిం పాతికేళ్ళు అవుతున్న సందర్బంగా ఈ నెల 27, 28 తేదీల్లో సిల్వర్ జూబిలీ వేడుకలను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొంటున్న మెగాస్టార్ ను ఏకంగా 200 కార్ల తో ర్యాలీ ని నిర్వహిస్తూ మెగాస్టార్ ని తీసుకెళ్తారట ? నిజంగా ఇది గొప్ప విషయం .

  •  
  •  
  •  
  •  

Comments