ఎన్టీఆర్ బయోపిక్ కోసం భారీ బహిరంగ సభ సెట్

Wednesday, May 9th, 2018, 03:45:30 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. దర్శకుడు తేజ.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. షూటింగ్ ఆలస్యం అయింది కానీ.. లేకపోతే ఈ పాటికే ఎన్టీఆర్ ప్రాజెక్టు పరుగులు పెట్టాల్సి ఉండేది. ఇప్పటికే ముహూర్తం కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఎన్.టి.ఆర్. మూవీకి.. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు.
ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆయన జీవితం మొత్తం పూర్తి స్థాయిలో ఒక సినిమాలో చూపడం సాధ్యం కాదనే విషయం ఒప్పుకోవాల్సిందే. అయితే.. ఇప్పుడు సినిమా షూటింగ్ ఆరంభం కోసం ఓ కీలకమైన సన్నివేశాన్ని ఎంచుకున్నారట. తిరుపతిలో జరిగిన బహిరంగ సభ ఎంతటి భారీ హిట్ అనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇదే ప్రారంభ సన్నివేశంగా ఉటుందట. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పుకు ఆద్యం పలికిన ఆ సభనే ఓపెనింగ్ సీన్ కా తీసుకుంటారట. షూటింగ్ కూడా అదే సీన్ తో మొదలుపెట్టనుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇందుకోసం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో భారీ బహిరంగ సభ సెట్ వేస్తున్నారు. షూటింగ్ జరిగే రోజున.. నందమూరి అభిమానులను ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయట. హెలికాప్టర్ లో బాలయ్య ఎంట్రీతో సీన్ అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు.