క్రేజీ మల్టీస్టారర్ కోసం భారీ సెట్స్ ?

Saturday, June 9th, 2018, 10:37:06 AM IST

టాలీవుడ్ లో తెరకెక్కే క్రేజీ మల్టీస్టారర్ గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ మల్టి స్టారర్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకోసం హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో భారీ సెట్ ని వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. # RRR పేరుతొ తెరకెక్కే ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్ గా కనిపిస్తే చరణ్ ఎస్సై గా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. నందమూరి – మెగా హీరోల కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా నిజంగా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్స్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments