భారీ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న సైరా?

Friday, July 27th, 2018, 11:30:55 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రం సైరా. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ భారీ మేజర్ షెడ్యూల్ ని హైద్రాబాద్ శివారులోని కోకాపేట లో వేసిన భారీ సెట్స్ లో దాదాపు 35 రోజుల పాటు జరుపుకుంది. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తదుపరి షెడ్యూల్ ఆగస్టు లో మొదలు కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార , తమన్నా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments