భారత జట్టుకు ఊహించని షాక్..వరల్డ్ కప్ నుంచి ధావన్ అవుట్

Tuesday, June 11th, 2019, 03:52:04 PM IST

ప్రతీ ఒక్క క్రికెట్ అభిమాని ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అనుకున్న వరల్డ్ కప్ టోర్నీ ఇటీవలే అట్టహాసంగా మొదలయిన సంగతి తెలిసిందే.గతంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ధోని సేన టార్గెట్ మిస్సయినా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిల్లోనూ మిస్సవ్వకూడదని పక్కాగా టీమ్ ను తీసుకొని రంగంలోకి దిగారు.ఇప్పటికే ఆడిన రెండు మ్యాచులు వరుసగా విజయాలు సాధించి అదే జోరును కొనసాగిద్దాం అనుకునే లోప్ భారత్ జట్టుకు మరియు క్రికెట్ అభిమానుల ఆనందాలకు బ్రేక్ పడింది.

మొన్న జరిగిన ఆసీస్ తో మ్యాచ్ లో శిఖర్ ధావన్ శతకంతో రెచ్చిపోయి కంగారులను ఖంగారు పెట్టించాడు.కానీ ఇప్పుడు అతని చేతి బొటని వేలికి గాయం తగలడం వలన ధావన్ మరో మూడు వారాల పాటు టోర్నీ నుంచి తప్పుకోవాలని వార్త బయటకు వచ్చింది.ఇది నిజంగా ఇప్పుడు భారత జట్టుకు పెద్ద షాకే అని చెప్పాలి.ఓపెనర్ బ్యాట్స్ మెన్ గా రోహిత్ తో ధావన్ వచ్చేవాడు.మరి ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.