జనసేనకు పెద్ద షాక్ – పార్టీ వీడిన నాయకురాలు

Sunday, August 18th, 2019, 12:26:45 AM IST

ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంతటి దారుణమైన ఓటమిని కూడగట్టుకుందో మనందరికీ తెలుసు… అయితే అంతటి దారుణమైన ఓటమినుండి కోలుకున్నాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం పై ద్రుష్టి పెట్టారు… కాగా అప్పటినుండి కూడా జనసేన పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉందని చెప్పాలి. ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో చేరిన కొందరు నేతలు కూడా జనసేన పార్టీ ని వదిలి వేరే పార్టీలో చేరిపోయారు. కాగా జనసేన పార్టీ కి తాజాగా మరొక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి,. అయితే జనసేనకు మహిళా నాయకురాలు జనసేనకు షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ మహిళా నాయకురాలు పుట్టి లక్ష్మీసామ్రాజ్యం జనసేన కు గుడ్ బై చెపింది. కాగా పార్టీ వీడిన లక్ష్మీ సామ్రాజ్యం జనసేన పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, పార్టీ నేతలను తప్పుబట్టింది.

కాగా ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామ్రాజ్యం గుంటూరు జిల్లా పెదకూరపాడు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయింది. కాగా ఇపుడు జనసేన పార్టీ కి సంబందించిన పరిణామాలు నచ్చకనే పార్టీ మారుతున్నాన్నాయి ఆమె ప్రకటించింది. కాగా బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలతో కలిసి లక్ష్మి సామ్రాజ్యం బీజేపీ తీర్థం పుచుకుంది. ఈసందర్భంగా మాట్లాడిన లక్ష్మి ఎన్నికల సమయంలో సొంత పార్టీ నేతలే తనపై లేనిపోని దుష్ప్రచారాలు చేసి, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారని, అసలు నిజాయితీగా పని చీవారికి జనసేన పార్టీలో పెద్దగా గుర్తింపు ఉండదని చెప్పారు. అంతేకాకుండా తొందర్లోనే జనసేన పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరతారని, జనసేన పార్టీ ఖాళీ కావడం ఖాయమని లక్ష్మి సామ్రాజ్యం అన్నారు.