టీడీపీకి మరో షాక్..సుజనా చౌదరిపై మరో కేసు నమోదు.!

Saturday, June 1st, 2019, 10:01:40 PM IST

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఘోరమైన పరాజయం చూసిందని ఓ పక్క ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉంటే అదే పార్టీకి చెందిన కీలక నేతలు సిబిఐ వలలో పడడం వారికి దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అవుతుంది.గత కొన్ని నెలల క్రితమే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ రాజ్యసభ నేత సుజనా చౌదరిపై సిబిఐ వారు అక్రమ ధనార్జన నేపథ్యంలో సోదాలు జరిపిన సంగతి అందరికీ తెలిసిందే.ఇదే వారికి పెద్ద షాక్ అంటే ఇప్పుడు సుజనాకు సంబంధించి మరింత అవినీతి చిట్టాను సిబిఐ వారు బయట పెడుతున్నారు.

కర్ణాటరాకలోని వెస్ట్ అండ్ కాంప్టన్ పేరిట ఒక కంపెనీ పెట్టి కోట్లాది రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని వాటిని అక్రమంగా సుజనా తరలించుకున్నారని సిబిఐ వారు తెలుపుతున్నారు.దీనితో హైదరాబాద్ సహా మరో మూడు చోట్ల సిబిఐ వారు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.అంతేకాకుండా సిబిఐ వారు సుజనా గ్రూప్స్ డైరెక్టర్ రమణా రెడ్డిని,మరియు సుధాకర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇందులో భాగంగా సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు రెండు హార్డ్ డిస్కులు సహా రెండు కంప్యూటర్లను సీజ్ చేసినట్టు తెలుస్తుంది.