అజ్ఞాతవాసికి టార్గెట్ రెడీ.. అది మాత్రం పక్కా..!

Sunday, January 7th, 2018, 11:41:17 PM IST

జనవరి 10 న విడుదల కానుండడంతో అజ్ఞాతవాసి సందడి పెరుగుతోంది. సినీ అభిమానుల అందరి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అలాంటింది. కాగా అజ్ఞాతవాసికి హిట్ టాక్ వస్తే వసూళ్ల ప్రభంజనం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం మొత్తం పంపిన హక్కులు 120 కోట్ల వరకు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 90 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. కాగా ఈ చిత్రం హిట్ అయిందని ముద్ర పడాలంటే మినిమమ్ 120 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవలసి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ చరిష్మా, త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా టాక్ తో సంబంధం లేకుండా తొలి వారంలో ఈ చిత్రం 80 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ టాక్ వస్తే అవలోకగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఈ చిత్ర వసూళ్లు ఉంటాయో చెప్పాలంటే విడుదల తరువాత వచ్చే టాక్ ని బట్టే అంచనా వేయొచ్చని అంటున్నారు. చూద్దాం విడుదల కు మరో రెండు రోజులుగా సమయం ఉంది !