మహర్షి కోసం భారీ విలేజ్ సెట్ ?

Friday, October 5th, 2018, 09:17:40 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం మహర్షి. మహేష్ కెరీర్ లో 25వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రాస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకుని మూడో షెడ్యూల్ కోసం అమెరికాలో ప్లాన్ చేశారు. అక్కడ ఇరవై రోజుల పాటు షూటింగ్ జరుపుకుని ఆ తరువాత టీమ్ తిరిగి హైద్రాబాద్ రానుంది. ఆ తరువాత షెడ్యూల్ ని ఇక్కడే ప్లాన్ చేశారు .. ఈ షెడ్యూల్ కోసం భారీగా విలాగే సెట్ ని రామోజీ ఫిలిం సిటీ లో నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక కథ మొత్తం నడిచేది అక్కడేనట. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఫిబ్రవరి వరకు షూటింగ్ పూర్తీ చేసి ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేస్తారట.