అవ‌మానాలెన్నో దిగ‌మింగుకున్నాం.. బిగ్‌బి తీవ్ర‌ ఆవేద‌న‌!!

Tuesday, November 7th, 2017, 09:07:55 PM IST

బోఫోర్స్ స్కాం.. ప‌నామా పేప‌ర్స్‌.. అక్ర‌మ క‌ట్ట‌డాలు.. ప్యార‌డైజ్ పేప‌ర్స్‌.. ఇవ‌న్నీ బిగ్‌బి అమితాబ్‌ని ఓ రేంజులో హింసించాయ‌ని తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చెబుతున్నాయి. స్కామ్‌ల పేరుతో త‌న‌ని త‌న కుటుంబాన్ని ప‌దే ప‌దే ఆవేద‌న‌కు, క‌ల‌త‌కు గురి చేశార‌ని అమితాబ్ తీవ్ర ఆవేద‌న‌తో బ్లాగులో రాసుకోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది. 74 వ‌య‌సులో వీటిని త‌ట్టుకోలేక‌పోతున్నాను. నాపైనా, నా కుటుంబంపై వ‌స్తున్న నిందారోప‌ణ‌ల్ని భ‌రించ‌లేక‌పోతున్నాన‌ని అమితాబ్ బ్లాగ్‌లో వ్యాఖ్యానించారు.

రీసెంటుగానే, ముంబై ప‌రిస‌రాల్లోని ఓ భారీ భ‌వంతి నిర్మాణం విష‌యంలో మీడియా వైఖ‌రి త‌న‌ని బాధించింద‌ని అమితాబ్ విచారం వ్య‌క్తం చేశారు. ఖాళీ స్థ‌లాన్ని ఆక్ర‌మించి అమితాబ్ స‌హా ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు అక్ర‌మ‌క‌ట్ట‌డాలు క‌ట్టార‌ని హెడ్‌లైన్స్‌లో వ‌చ్చింది. అప్ప‌ట్లోనే బిగ్‌బి మీడియా ముఖంగా ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని, తాను అలాంటిదేం చేయ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ త‌ర్వాత నిన్న‌టికి నిన్న‌ ప‌నామా పేప‌ర్స్‌లో బిగ్‌బి పేరు ప్ర‌ముఖంగా ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. నేడు అన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ఆ వార్త‌నే హైలైట్. ఈ నేప‌థ్యంలో ప‌త్రిక క‌థ‌నాల‌కు బిగ్‌బి చ‌లించిపోయారు. బాధ‌తో ఆవేద‌న‌గా బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా త‌న‌పై వ‌చ్చిన‌ వివాదాస్ప‌ద క‌థ‌నాలు ప‌రువు తీశాయ‌ని ఆవేద‌న చెందారు అమితాబ్‌బ‌చ్చ‌న్‌. “ఈ వయసులో నాకు ప్రశాంతత కావాలి… నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొన్నేళ్లు హాయిగా గడపాలనుకుంటున్నా“ అంటూ బ్లాగ్‌లో విచారం వ్య‌క్తం చేశారు. `ప్యార‌డైజ్ పేప‌ర్స్‌` లీకేజీ వ్య‌వ‌హారంలోనూ అమితాబ్ పేరు ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. ఆఫ్‌సోర్ కంపెనీల పేరుతో అమితాబ్ ప‌న్నులు ఎగ్గొట్టార‌ని వెలువ‌డిన‌ క‌థ‌నాలు తీవ్రంగా బాధించాయ‌ని బిగ్‌బి ఆవేద‌నగా బ్లాగులో వివ‌ర‌ణ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. నా పేరు హెడ్‌లైన్స్‌లో వచ్చినా నేను పట్టించుకోను. ఇప్పటివరకు అక్రమ కట్టడాలు, ఆస్తుల విషయాల్లో నాకు నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేనేలేదని తెలిపారు. నాపైనా, నా ఫ్యామిలీపైనా వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డాం. ఎన్నో అవమానాలు దిగ‌మింగుకున్నామ‌ని అమితాబ్ వేద‌న‌గా రాసుకొచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments