క్రికెట్ వ్యాఖ్యాత‌కు మెగాస్టార్ చీవాట్లు!

Tuesday, February 20th, 2018, 10:13:26 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌డాఖా ఏంటో ట్విట్ట‌ర్ వాళ్ల‌కు తెలిసొచ్చింది. నా ట్విట్ట‌ర్‌లోంచి ఒక్కొక్క‌రూ వెళ్లిపోతున్నారు. అస‌లేం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేదు. ట్విట్ట‌ర్ వాళ్లు ఇలా తొల‌గిస్తే, వెంట‌నే నేను ట్విట్ట‌ర్ వ‌దిలి వెళ్లిపోతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. బిగ్‌బి ఇలా వార్నింగ్ ఇచ్చారో లేదో అలా ట్విట్ట‌ర్ ప్ర‌తినిధులు ఇంటికొచ్చి సంజాయిషీ ఇచ్చుకున్నారు. త‌ప్పిదానికి లెంప‌లేసుకుని జ‌రిగిన పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకుంటామ‌ని అన్నారు. అమితాబ్ అంత‌టివాడే ఆగ్ర‌హిస్తే ఎలా ఉంటుందో చెప్పుకునేందుకు ఈ ఉదాహ‌ర‌ణ చాలు.

అయితే అమితాబ్ ఆగ్ర‌హానికి గురైంది కేవ‌లం ట్విట్ట‌ర్ వాళ్లే కాదు. ఇదిగో క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్షాభోగ్లేకి ఓ రేంజులో పంచ్ ప‌డింది. మొన్న ద‌క్షిణాఫిక్రాతో టి-20 తొలి మ్యాచ్‌లో హ‌ర్షా భోగ్లే కామెంట‌రీపై బిగ్‌బి త‌న‌దైన స్టైల్లో చుర‌క‌లు వేశారు. ఆయ‌న‌ కామెంట్రీ వ‌ల్ల‌నే మ‌న టీమ్ ప్ర‌తిసారీ గెలుస్తోంది.. మీరు ఇలానే మీ కామెంట్రీని కొన‌సాగించండి. ఇండియా గెలుస్తూనే ఉంటుంది! అంటూ పంచ్ వేశారు. “బ్రిలియంట్ ప్లే.. ల‌వ్‌డ్ ది అగ్రెస్స‌న్‌.. ల‌వ్‌డ్ ది బ‌యాస్(డౌట్‌ఫుల్ గా) కామెంటేటింగ్‌..“ అంటూ బిగ్‌బి ట్వీటిన తీరు చూస్తుంటే.. ఆయ‌న తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థంకాని ప‌రిస్థితి. ఇదివ‌ర‌కూ 2016లో ఓసారి హ‌ర్షాభోగ్లే కామెంట్రీపై ఇదే తీరుగా సెటైర్ వేశారు అమితాబ్‌. ఆయ‌న కామెంట్రీ అంతా మ‌న ఆట‌గాళ్లనుద్ధేశించే కంటే… ఇత‌రుల‌పైనే ఎక్కువ‌! అంటూ పంచ్ వేశారు.