‘బిగ్‌బాస్‌-11’ బ్యూటీ మీద ప‌డిన‌ జ‌నం!

Monday, February 12th, 2018, 12:40:35 PM IST

భోగం మేళాంలో నగ్న నృత్యాలు చూసిన‌ప్పుడు జ‌నం విర్ర‌వీగి మీద‌ప‌డుతుంటారు. ప‌ల్లెల్లో జాత‌ర‌ల వేళ రెగ్యుల‌ర్‌గా క‌నిపించేది ఒక‌ప్పుడు. ఆ క్ర‌మంలోనే భోగం మేళంను ప్ర‌భుత్వాలు నిషేధించాయి. ప్ర‌స్తుతం రికార్డింగు డ్యాన్సుల్ని నిషేధించినా, జాత‌ర‌ల వేళ సీక్రెట్‌గా వీటిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. విలేజీల్లో ఔత్సాహిక యువ‌త‌రం పండ‌గ‌లు – ప‌బ్బాల వేళ ఈ రికార్డింగ్ డ్యాన్సుల్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నాయి. అయితే జాత‌ర‌లో స్టెప్పుల త‌ర‌హాలోనే అదిరిపోయే మూవ్ మెంట్స్‌తో కిక్కు ర‌ప్పిస్తోంది హిందీ `బిగ్ బాస్-11` పార్టిసిపెంట్ సాప్నా డాళింగ్‌.

సాప్నా డ్యాన్సాడితే స్టేజీ ఊగిపోవాల్సిందే. ఆ సంగ‌తి బిగ్‌బాస్ షోలో స‌ల్మాన్ భాయ్ అంత‌టివాడికే అనుభ‌వ‌మైంది. ఇక ఆ డ్యాన్స్ మూవ్‌మెంట్‌కి కుర్ర‌కారు అయితే ఎప్పుడో జేజేలు ప‌లికారు. అంత ఊపు మీద ఇంత అందగ‌త్తె డ్యాన్సులాడుతుంటే జ‌నం ఊరుకుంటారా? వెర్రెత్తి శివాలెయ్య‌రూ? ఈ సీన్‌లో అంత‌కుమించి వీరంగం వేశారు అభిమానులు. జ‌నం స్టేజీ మీద‌కు ఎగ‌బ‌డ్డారు. అక్క‌డ ప్రాప‌ర్టీని చింపేశారు. సెక్యూరిటీని తోసేశారు. ఆ స‌న్నివేశం ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించింది. అయితే అదంతా సాప్నా డ్యాన్సుల‌కు ఉన్న ఊపు అనే చెప్పాలి. కాన్పూర్‌లో ఓ వేడుక‌లో ర‌చ్చ రచ్చ అయ్యింది. సాప్నా ఉత్త‌రాదిన మేటి డ్యాన్సింగ్ స్టార్‌గా పాపుల‌ర‌య్యారు. స‌ల్మాన్ హోస్టింగ్ చేసిన బిగ్‌బాస్ 11 సీజ‌న్‌తో మ‌రింత పాపుల‌రై ప్ర‌స్తుతం సినిమా ఛాన్సులు అందుకుంటున్నారు. ఇదివ‌ర‌కూ క‌ల‌ర్స్ పాపుల‌ర్‌ షో `లాడూ-వీర్‌పుర్ కి మ‌ర్ధానీ` షోలోనూ సాప్నా డ్యాన్సులకు యువ‌జ‌నం ఆక‌ర్షితుల‌య్యారు. అభ‌య్ డియోల్ సినిమా `నాను కి జాను`లో సాప్నా ఓ పాట‌లో న‌ర్తిస్తుండ‌డం విశేషం. తాజా ఇన్సిడెంట్‌తో సాప్నా క్రేజు మ‌రింత రెట్టింప‌వుతుంది.