ష్‌! బిగ్‌బాస్!! జంట‌ల‌కు మాత్ర‌మే!?

Monday, April 16th, 2018, 09:59:34 PM IST

బాలీవుడ్ `బిగ్‌బాస్` 12వ సీజ‌న్ హీట్ మొద‌లైంది. స‌ల్మాన్ భాయ్ మ‌రోసారి హోస్టింగుకి రెడీ అవుతున్నారు. ఈసారి బిగ్‌బాస్ మునుప‌టి కంటే రక్తి క‌ట్టించాల‌న్న‌ది భాయ్ ప్లాన్‌. సీజ‌న్ 11 ర‌చ్చ ర‌చ్చ‌తో పెద్ద రేంజులో టీఆర్‌పీలు తెచ్చింది. ఈసారి కూడా అంత‌కుమించిన ర‌చ్చ‌తో ముందుకు న‌డిపించాల‌న్న‌ది ప్లాన్‌.

ఈసారి సీజ‌న్ ర‌క్తిక‌ట్టించేందుకు ఇప్ప‌టికే ల‌వ్‌లో ఉన్న క‌పుల్ కానీ, లేదూ ఆల్రెడీ పెళ్ల‌యిన క‌పుల్ కానీ పార్టిసిపెంట్లుగా ఉంటార‌ట‌. అందుకు సెల‌క్ష‌న్ ప్రాసెస్ స్టార్ట‌యింది. స‌ల్మాన్ భాయ్ స్వ‌యంగా ఈ సీజ‌న్ కోసం “బిగ్‌బాస్‌కి జంట‌లు కావ‌లెను“ అని ప్ర‌క‌టించారు. అయితే జంట‌లు కావాలి అని అంటే సోన‌మ్ – అహూజా, ర‌ణ‌వీర్ – దీపిక‌, విరాట్ – అనుష్క వంటి వాళ్లే కావాలేమో?