ఎన్టీఆర్ కాదంటే, నాగార్జున ఔన‌న్నారు!

Tuesday, September 11th, 2018, 02:14:10 PM IST

స్టార్‌-మాలో బిగ్‌బాస్ ర‌చ్చ గురించి తెలిసిందే. ప‌నీపాటా లేనివాళ్ల‌కు గంట‌న్న‌ర పాటు నిర‌భ్యంత‌రంగా ప‌ని చెబుతోంది ఈ కార్య‌క్ర‌మం అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. పాశ్చాత్య విష సంస్కృతిని ఇండియాకి తేవ‌డ‌మే ముప్పు అనుకుంటే, అదిప్పుడు నేరుగా తెలుగు లోగిళ్ల‌లోకి ప్ర‌వేశించి నానా ర‌చ్చ చేయ‌డంపై సీరియ‌స్‌గా చ‌ర్చ సాగుతోంది. దీనిపై ఇటీవ‌లే పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైన సంగతి తెలిసిందే.

ఏదోలా సీజ‌న్ 2 ఈనెలాఖ‌రు నాటికి ముగుస్తోంది. ఈ ముగింపు వేళ గ్రాండ్ ఫైన‌ల్స్‌కి కింగ్ నాగార్జున అతిధిగా విచ్చేస్తున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ గ్రాండ్ ఫైన‌ల్స్‌కి యంగ్ య‌మ ఎన్టీఆర్ అతిధిగా వ‌స్తే టీఆర్‌పీ బావుంటుంద‌ని స్టార్ -మా భావించి అత‌డిని సంప్ర‌దించింది. కానీ ఇటీవ‌లి ప‌రిణామాలు తార‌క్‌కి ఇబ్బందిక‌రంగా మార‌డంతో నో చెప్పార‌ట‌. రీసెంటుగానే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ తో అర‌వింద స‌మేత షూటింగు వాయిదా ప‌డింది. దీనివ‌ల్ల రిలీజ్ తేదీ డెడ్‌లైన్ ప్ర‌కారం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు. దీనివ‌ల్ల ఈ షోకి అటెండ‌వ్వ‌డానికి స‌మ‌యం లేద‌ని చెప్పేశాడ‌ట‌. అటుపై స్టార్ – మా ప్ర‌తినిధులు కింగ్ నాగార్జున‌ను సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. ఎలానూ నాగార్జున న‌టించిన దేవ‌దాస్ ఈనెల 27న రిలీజ‌వుతోంది కాబ‌ట్టి, బిగ్ బాస్ హౌస్‌లోనే ఆ సినిమా ప్ర‌మోష‌న్ చేసేందుకు నాగార్జున ప్లాన్ చేశార‌ట‌. స్వామికార్యం, స‌కార్యం పూర్త‌వుతున్నాయి కాబ‌ట్టి, గ్రాండ్ ఫైన‌ల్స్‌కి అతిధిగా నాగ్ ఫిక్స‌య్యార‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments