బిగ్ బాస్ రెండో సీజన్ లో పాల్గొనేది వీళ్లేనా ?

Wednesday, May 16th, 2018, 03:14:51 AM IST


తెలుగులో ఇదివరకే వచ్చిన బిగ్ బాస్ రియాలిటి షో మంచి విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండో సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనని చెప్పడంతో అందుకోసం .. హీరో నాని తో చేయించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో ఎవరు పాల్గొంటారా అన్న విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరి పేర్లు బయటికి వస్తున్నాయి. మరి వారెవరో తెలుసా .. సింగర్ గీత మాధురి, శ్యామల (ట్రాన్స్ జెండర్), రాశీ, తేజస్వి మాదివాడ, గజాల లాంటి వారి పేర్లు వినిపిస్తుండగా ఇంకా పురుషులు ఎవరున్నారన్న విషయం బయటికి రాలేదు. జూలై లో రెండో సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Comments