రెండో బిగ్ బాస్.. వచ్చేస్తున్నాడు?

Wednesday, May 9th, 2018, 11:59:03 AM IST

ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలు పెట్టిన బిగ్ బాస్ రియాలిటీ షో సూపర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో రెండో సీజన్ చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి. అయితే రెండో సీజన్ విషయంలో ఎన్టీఆర్ నో చెప్పడంతో అయన ప్లేస్ లోకి నాని దింపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా హోస్ట్ విషయం కన్ఫర్మ్ కాలేదు కాబట్టి తెలుగులో మొదలయ్యేందుకు కాస్త టైం పట్టేలా ఉంది .. కానీ తమిళంలో అయితే వెంటనే మొదలు పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే షో అటు తమిళంలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. జాతీయ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ రెండో సీజన్ కు అయన ఓకే చెప్పడంతో వెంటనే ఆ షో మొదలు పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ 25 నుండి అక్కడ బిగ్ బాస్ రెండో సీజన్ మొదలు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ మళ్ళీ టివి షో చేయడం ఆసక్తిగా నిలిచింది. ఒకవేళ కమల్ హాసన్ నో చెబితే అయన ప్లేస్ లోకి హీరో సూర్య ని తెచ్చే ప్రయత్నాలు జరిగాయి .. కానీ కమల్ హాసన్ ఓకే చెప్పడంతో వెంటనే షో మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.