ఒకే ఒక్క బిగ్ బాస్ షో సోషల్ మీడియాలో కొంత మంది ఫసక్..!

Wednesday, October 3rd, 2018, 07:56:56 PM IST


బుల్లి తెర మీద బిగ్ బాస్ షో ఎంత సంచలనమో వేరే చెప్పక్కర్లేదు.తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ రెండు సీసన్లను నెత్తిన పెట్టుకున్నారు అని చెప్పాలి.ముందు రెండో సీసన్ కు కాస్త వ్యతిరేకత వచ్చినా సరే రోజు రోజుకి అమితంగా ప్రజాదారణ చేకూరింది.ఈ ఒక్క షోతో ప్రేక్షకుల్లో హీరోగా వచ్చిన వాళ్ళు జీరో అయ్యిపోయారు.అస్సలు ఏ అంచనాలు లేకుండా వచ్చిన వాళ్ళు హీరో అయ్యిపోయారు.

బిగ్ బాస్ ఇంట్లో తనీష్,తేజస్వి తదితరులు అక్కడి ఇతరులతో పోల్చితే వారికి కాస్త స్టార్డమ్ ఎక్కువే అని చెప్పాలి.అంతకు మునుపు కౌశల్ కూడా కొన్ని చిత్రాల్లో నటించినా సరే వీరి స్థాయిలో ఉన్నంత చిత్రాలు లేవనే చెప్పాలి.కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసరికి మొత్తం అంతా తిరగబడిపోయింది.తేజస్వి,తనీష్ లు వారి స్వార్ధ భావంతో ప్రేక్షకుల్లో ఉన్న కాస్త ఆదరణని కూడా పోగొట్టుకున్నారు.కౌశల్ మీద వీరు ఇద్దరు విషం కక్కేసరికి ఇక మొత్తంగా సోషల్ మీడియాలో కౌశల్ ఒక్కసారిగా హీరో అయ్యిపోయాడు.అప్పటికే మంచి ఆదరణ ఉన్నటువంటి తేజస్వి,తనీష్,దీప్తి సునైన మరియు బాబు గోగినేనిలు కౌశల్ పట్ల చూపించిన వివక్షత పట్ల విరోధులు అయ్యిపోయారు,దీనితో సోషల్ మీడియాలో వీరి మీద విపరీతమైన ట్రోల్స్,ట్రెండింగ్లు నడిచాయి.