బ్రేకింగ్ : ఏపీలో ఇదే బిగ్గెస్ట్ రికార్డ్..ఒక్కరోజులో భారీ కేసులు.!

Saturday, June 27th, 2020, 02:01:34 PM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రికార్డుల లెక్కలు ప్రతీ ట్రోజు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏపీలో కేసులు సంఖ్య పెంచుతున్న కొద్దీ పెరుగుతుంటే తెలంగాణాలో మాత్రం తక్కువ శాంపిల్స్ తీసుకున్నా సరే ఎక్కువ భారీగా కేసులు నమోదు అవుతుండడం గమనార్హం.

అలా ఇప్పుడు ఏపీలో గత 24 గంటల్లో నమోదు కాబడిన కరోనా లెక్కలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 22 వేల 305 శాంపిల్స్ ను పరీక్షించగా ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 740 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్టుగా తెలిపారు.

అంతే కాకుండా మొత్తం 263 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా 11 మంది మృత్యువాత పడినట్టుగా నిర్దారించారు. ఇతర రాష్ట్రాలు మరియు దేశాల నుంచి వచ్చిన వారితో కలిపితే మొత్తం 796కు ఈ సంఖ్య చేరుకుంది. దేనితో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 10 వేల 93 కేసులు నమోదు అయ్యాయి.