అమెరికా అధ్య‌క్షుడి న‌వ‌ల టీవీ సిరీస్‌గా తెర‌పైకి..

Sunday, September 24th, 2017, 11:07:44 PM IST


అమెరికా మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింటన్ నాన్‌ఫిక్ష‌న్ రైట‌ర్‌గా ప్ర‌పంచానికి సుప‌రిచితం. `మై లైఫ్, బ్యాక్ టు వ‌ర్క్‌: వై వియ్ నీడ్ స్మార్ట్ గ‌వ‌ర్న‌మెంట్ ఫ‌ర్ స్ట్రాంగ్ ఎకాన‌మీ`, బిట్వీన్ హోప్ అండ్ హిస్ట‌రీ, గివింగ్‌: హౌ ఈచ్ ఆఫ్ అజ్ కెన్ ఛేంజ్ ది వ‌ర‌ల్డ్‌, పుట్టింగ్ పీపుల్ ఫ‌స్ట్‌: హౌ వియ్ కెన్ ఆల్ ఛేంజ్ అమెరికా.. ఇలా ఎన్నో నాన్ ఫిక్ష‌న్ బుక్స్ ర‌చించి బెస్ట్ సెల్లింగ్ కేట‌గిరీలో టాప‌ర్‌గా పాపుల‌ర‌య్యారు క్లింట‌న్‌. అందుకే క్లింట‌న్ రాస్తున్న ఓ న‌వ‌ల ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

`ది ప్రెసిడెంట్ ఈజ్ మిస్సింగ్‌` అనే టైటిల్‌తో 2018లో ఆవిష్క‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ న‌వ‌లను టీవీ సిరీస్ కోసం అడాప్ట్ చేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. క్లింట‌న్‌తో క‌లిసి ర‌చ‌యిత జేమ్స్ పాట‌ర్స‌న్ ఈ న‌వ‌ల రాస్తున్నారు. ప్ర‌ముఖ కేబుల్ నెట్‌వ‌ర్క్ షో టైమ్ ఈ న‌వ‌ల టీవీ అడాప్టేష‌న్‌ హ‌క్కుల్ని సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా బిల్ క్లింట‌న్ మాట్లాడుతూ .. అమెరికాలో కొన్ని పరిణామాల అనంత‌రం అధ్య‌క్షుడు(క్లింట‌న్‌) అదృశ్య‌మ‌వ్వ‌డానికి కార‌ణాలేంటి? అన్న‌ది ఈ న‌వ‌ల‌లో ప్ర‌స్థావిస్తున్నామ‌ని తెలిపారు. థ్రిల్ల‌ర్ ఫార్మాట్‌లో టీవీ సిరీస్ తెర‌కెక్కించే ఆలోచ‌న ఎగ్జ‌యిట్ చేస్తోంద‌ని అన్నారు. బిల్ క్లింట‌న్ అమెరికాకు 45వ అధ్య‌క్షుడిగా సేవ‌లందించారు.

  •  
  •  
  •  
  •  

Comments