మ‌ద‌న‌ల్లె మిర‌ప‌కాయ్‌లా బిందు మాధ‌వి!

Thursday, January 11th, 2018, 11:28:11 PM IST

A post shared by Bindu Madhavi (@bindu_madhavii) on

గుంటూరు నుంచి మ‌ద‌న‌ప‌ల్లి మ‌ధ్య‌లో మిర‌ప‌కాయ‌ల‌కు కాస్తంత కారంఘాటు ఎక్కువేన‌న్న‌ది అనుభ‌వం. అందుకే ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న తెలుగ‌మ్మాయి.. మ‌ద‌న‌ప‌ల్లె అమ్మాయిని ఏకంగా గుంటూరు మిర‌క‌పాయ‌తో పోల్చాల్సొచ్చింది. చిత్తూరు జిల్లాలోని మ‌ద‌న‌ప‌ల్లె నుంచి ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన బిందు తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ పాపుల‌రైంది. అక్క‌డ బిగ్ బాస్ లాంటి షోల‌తో మ‌రింత‌గా పాపులారిటీ పెంచుకుంది. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం బిందు కెరీర్‌లో స్పీడ్ పెరిగింద‌ని తెలుస్తోంది. ఆవ‌కాయ్ బిరియానీ, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాల్లో న‌టించిన ఈ భామ‌కు ఇక్క‌డ ఛాన్సుల్లేక‌పోయినా త‌మిళంలో మాత్రం బిజీ బిజీ.

ఇటీవ‌లి కాలంలో బిందు మాధ‌వి ఓ మ్యాగజైన్‌కి అదిరిపోయే ఫోటోషూట్ ఇచ్చింది. ఈ ఫోటోషూట్ కాస్తంత ఘాటుగానే ఉంద‌ని చెప్పాలి. అల్ట్రా మోడ్ర‌న్ లుక్‌తో క‌ట్టిప‌డేస్తోంది. త‌న‌ని ఈ లుక్‌లో చూశాక టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అప్రోచ్ అవుతార‌నే అనిపిస్తోంది. చూద్దాం.. కొత్త సంవ‌త్స‌రం అయినా క‌లిసొస్తుందేమో?