భర్త తో కలిసి బిపాసా సినిమా చేస్తుంది ?

Friday, September 14th, 2018, 11:01:07 PM IST


బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకుని దాదాపు 20 ఏళ్లుగా అదే గ్లామర్ ని మెయింటన్ చేసిన హాట్ భామ బిపాసా గత రెండేళ్ల క్రితం నటుడు కరణ్ ను వివాహం చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అడపా దడపా ఇద్దరు కలిసి యాడ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకున్న బిపాసాకు ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఓ తీన్ హై సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నిజానికి ఈ సినిమాలో క్రేజీ భామ ఐశ్వర్య రాయ్ నటించాల్సి ఉంది కానీ ఆమె తప్పుకోవడంతో బిపాసా ఎంటర్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోగా బిపాసా భర్త ను ఎంపిక చేసారు .. దాంతో ఇప్పుడు భార్య భర్తలు కలిసి నటిస్తున్నారు. 2016 లో కరణ్ సింగ్ గ్రోవర్ ని ప్రేమించి వివాహం చేసుకున్న బిప్స్ .. పెళ్లి తరువాత కావాలనే రెండేళ్లు గ్యాప్ తీసుకుంది.

  •  
  •  
  •  
  •  

Comments