ఆకాష్ పూరికి సూప‌ర్భ్‌ విషెస్‌

Thursday, July 26th, 2018, 12:36:48 PM IST

స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్రా పోరి, మెహ‌బూబా చిత్రాల‌తో హీరోగా అదృష్టం ప‌రీక్షించుకున్నాడు. అయితే తొలి రెండు సినిమాలు ఆకాష్‌కి ప్రీప్రాక్టీస్‌గా మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ్డాయి. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు ద‌క్క‌క‌పోయినా, ఆకాష్ న‌ట‌న‌కు, గ‌ట్స్ కి వంద‌కు వంద మార్కులేశారు క్రిటిక్స్. ఇటీవ‌లే మెహ‌బూబా చిత్రంలో ఆకాష్ డేరింగ్ స్టన్నింగ్ పెర్ఫామెన్స్‌కి అంద‌రూ అభిమానులుగా మారారు. అందుకే మునుముందు అత‌డికి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని పూరి హితులు, స‌న్నిహితులు అంతా పొగిడేయ‌డం విశేషం.

నేడు ఆకాష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బుజ్జిగాడు ప్ర‌భాస్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, సుబ్బ‌రాజు, ప్రియ‌మ‌ణి స‌హా ప‌లువురు సినీప్ర‌ముఖులు ప్ర‌త్యేకంగా అత‌డికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతేకాదు వీళ్లంతా వీడియో బైట్స్‌ని ఇవ్వ‌డం విశేషం. నితిన్‌, ర‌వితేజ‌, నితిన్‌, అల్లు శిరీష్, సుకుమార్, సాయిధ‌ర‌మ్, అలీ, ద‌శ‌ర‌థ్‌, సిరాశ్రీ‌, సుబ్బ‌రాజు, కోన వెంక‌ట్‌, సుబ్బ‌రాజు, ప్రియ‌మ‌ణి వీళ్లంతా వీడియో బైట్స్ ద్వారా ఆకాష్‌కి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. పూరి కొడుకు ఆకాష్ కాదు, ఆకాష్ తండ్రి పూరి అనే రేంజులో ఎద‌గాల‌ని అలీ విషెస్ తెలిపాడు. ఆకాష్ ప్ర‌స్తుతం తండ్రి పూరి ద‌ర్శ‌క‌త్వంలోనే వేరొక సినిమాలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments