వంశీ పైడిప‌ల్లి .. ఎట్టెట్టా సారూ?

Friday, July 27th, 2018, 03:45:04 PM IST

ప్ర‌స్తుతం టాలీవుడ్ మేటి ద‌ర్శ‌కుల్లో ఒక‌డిగా వెలిగిపోతున్నాడు వంశీ పైడిపల్లి. అత‌డు సంఖ్యా ప‌రంగా తీసింది నాలుగు సినిమాలే అయినా అందులో అన్నీ బ్లాక్‌బ‌స్టర్లే కావ‌డంతో బ‌డా స్టార్లు అవ‌కాశాలిచ్చేందుకు వెన‌కాడ‌డం లేదు. అయితే అత‌డు ప‌దేళ్ల కెరీర్‌లో తెర‌కెక్కించింది కేవ‌లం ఐదు సినిమాలేనా? అని అనిపించ‌క మాన‌దు. 2007లో కెరీర్ ప్రారంభించిన వంశీ పైడిప‌ల్లి ప్ర‌భాస్ హీరోగా మున్నా చిత్రం తెర‌కెక్కించాడు. తొలి సినిమా ఫ్లాపైనా, దిల్‌రాజుతో ఉన్న కాంట్రాక్ట్ వ‌ల్ల మ‌రో రెండు సినిమాలు అదే బ్యాన‌ర్‌లో చేశాడు. అలా చ‌ర‌ణ్‌తో ఎవ‌డు, ఎన్టీఆర్‌తో బృందావ‌నం తెర‌కెక్కించాడు. అవి రెండూ బ్లాక్‌బ‌స్ట‌ర్స్. ఒక‌టి మాస్‌లో మాసివ్ హిట్ అయితే, ఇంకొక‌టి క్లాస్‌లో క్లాసిక్ హిట్ అయ్యాయి. ఇటీవ‌లే నాగార్జున‌- కార్తీల‌తో ఊపిరి లాంటి మ‌ల్టీస్టార‌ర్ తీసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.

ఆ కాన్ఫిడెన్స్‌తోనే వంశీ వినిపించిన క‌థ‌కు మ‌హేష్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై స్వింగులో ఉంది. మ‌హేష్‌ని ఈ చిత్రంలో ఓ రైతు పాత్ర‌లో చూపిస్తున్నాడు. అలానే రైతు స‌మ‌స్య‌లపైనా ఈ సినిమాని తీస్తున్నాడు. అదంతా అటుంచితే వంశీ త‌న కెరీర్‌లో నాలుగు తెలుగు సినిమాలు తీసి, ఒక క‌న్న‌డ రీమేక్ సినిమా తీయ‌డం చూస్తుంటే ప‌దేళ్ల కెరీర్‌లో అత‌డు సాధించింది ఇంతేనా? అనిపించ‌క మాన‌దు. అయితే సెల‌క్టివ్ గా స్టార్ హీరోల‌తోనే సినిమాలు తీయాల‌న్న త‌ప‌న వ‌ల్ల‌నే అత‌డి కెరీర్ ఇలా సాగుతుంద‌ని భావించ‌వ‌చ్చు. నేడు అత‌డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments